ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రం అవుతుంది. మనం తీసుకునే ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఉదయాన్నే వేడి నీళ్లు తాగడంతో శరీరంలోని మలినాలు సులువుగా బయటకు వెళ్లిపోతాయి. రక్తనాళాలు చురుగ్గా మారి.. రక్తం వేగంగా సరఫరా అవుతుంది. పంటినొప్పిలో వేడినీళ్లు తాగడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.