కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనపై అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘ఖర్గే జీ, నా మీద కోపం తెచ్చుకోకండి. హైదరాబాద్ నిజాం రజాకార్ల మీద కోపం తెచ్చుకోండి. 1948లో వారు మీ గ్రామంలోని హిందువులను దారుణంగా చంపారు. గ్రామం మొత్తాన్ని తగులబెట్టారు. గౌరవనీయమైన మీ తల్లి, సోదరిని కాల్చి చంపారు. ఓటు బ్యాంక్ కోసం మీ తల్లి, చెల్లి విషాద మరణాన్ని మరచిపోయారు’ అని అన్నారు.