దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి కేవలం రైతులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని పంజాబ్ గవర్నర్ గులాబ్చంద్ కటారియా అన్నారు. రైతుల సమస్యలనూ అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాల దహనం కారణమనే వాదనలు ప్రతిఏటా వినిపిస్తున్న విషయం తెలిసిందే.