‘భారత్‌పే’ మాజీ ఎండీ అశ్నీర్, ఆయన భార్య మాధురిపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ నోటీసులు రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మోసం, ఫోర్జరీ ఆరోపణలపై ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే అదే రోజు ఎఫ్ఐఆర్ను హైకోర్టు మరో బెంచ్ రద్దు చేసినట్లు తెలియడంతో జస్టిస్ సంజీవ్ నరులా లుక్అవుట్ నోటీసులు రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.