AP: రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై NHRCలో ఫిర్యాదు చేశామని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తమ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు అక్రమమని.. పోలీసులు అక్రమంగా కార్యకర్తలను బంధించి వేస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత 2 వారాల్లో 57 మందిపై కేసులు పెట్టారని.. 14 మందినే అరెస్ట్ చేసినట్టు చూపించారని, మరో 12 మంది ఎక్కడున్నారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.