KKD: సామర్లకోట ఐదు తూముల వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో మహిళ మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన సింహాద్రి అనే మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఇదే ప్రమాదంలో ఇప్పటికే ఉప్పాడకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.