AKP: జిల్లాలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ భౌతికశాస్త్రం పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 15కేంద్రాల్లో 1,259 మందికి 1,087 మంది హాజరుకాగా, 172మంది గైర్హాజరయ్యారు. డీఈవో 2 కేంద్రాలను, స్క్వాడ్ బృందాలు 8 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు 7కేంద్రాల్లో 377మందికి 295 మంది హాజరయ్యారని DEO అప్పారావు నాయుడు తెలిపారు.