NRPT: నారాయణపేట డిపో నుంచి కొల్లాపూర్ సోమశిలకు పల్లె వెలుగు ఆర్టీసీ బస్ సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ఉదయం 8 గంటలకు బయలుదేరి మరికల్ ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ మీదుగా సోమశిలకు మధ్యాహ్నం 1:20 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 1:50 ప్రారంభమై సాయంత్రం 7:10 గంటలకు నారాయణపేటకు చేరుకుంటుందని అన్నారు.