»Most Cbi Officials Were Against Manish Sisodias Arrestkejriwal
arvind Kejriwal:చాలామంది సీబీఐ అధికారులు సిసోడియా అరెస్ట్‌ను వ్యతిరేకించారు
arvind Kejriwal:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Most CBI officials were against Manish Sisodia’s arrest:Kejriwal
arvind Kejriwal:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 8 గంటల పాటు సుధీర్ఘంగా ప్రశ్నించి.. సరైన సమాధానాలు చెప్పలేదని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ఆప్ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind Kejriwal) అన్నారు.
‘చాలా మంది సీబీఐ అధికారులు సిసోడియాను (sisodia) అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకించారు. సిసోడియా అంటే వారికి చాలా గౌరవం. అతనికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేదు. సిసోడియాను అరెస్ట్ చేయాలని వారిపై ఒత్తిడి ఉంది. రాజకీయంగా ప్రెషర్ ఉండటంతో తలొగ్గి పనిచేశారని’ కేజ్రీవాల్ (Kejriwal) ట్వీట్ చేశారు.
ప్రభుత్వ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవకతవకలు చోటు చేసుకున్న అంశంపై సీబీఐ (cbi) దర్యాఫ్తు చేస్తోంది. మనీశ్ సిసోడియా (manish sisodia) విచారణకు సహకరించక పోవడంతో అరెస్ట్ చేశామని సీబీఐ చెబుతోంది. కీలక అంశాల మీద సమాధానం ఇవ్వడం లేదని వెల్లడించింది. దర్యాఫ్తుకు ఏమాత్రం సహకరించలేదని సీబీఐ తెలిపింది. సిసోడియా ఇతరుల పేర్ల మీద వివిధ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. కొన్నింటిని ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. 18 ఫోన్లు, నాలుగు ఫోన్ నెంబర్లు వినియోగించారు. ఒక్కరోజులో మూడు ఫోన్లు మార్చారని సీబీఐ చెబుతోంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 19వ తేదీన మనీశ్ సిసోడియా (Manish sisodia) హాజరు కావాలని సీబీఐ అధికారులు స్పష్టంచేశారు. ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నానని ఆర్థిక ఏడాది బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నానని సిసోడియా చెబుతున్నారు. సమయం కావాలని సీబీఐ(CBI)ను మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ అధికారులు అంగీకరించారు. 26వ తేదీన రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆదివారం (26వ తేదీ) మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను విచారించి, అరెస్ట్ చేశారు.
I am told that most CBI officers were against Manish’s arrest. All of them have huge respect for him and there is no evidence against him. But the political pressure to arrest him was so high that they had to obey their political masters
లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురి పేర్లను సీబీఐ(CBI) అధికారులు చేర్చారు. ఆ లిస్ట్ లో తొలుత మనీశ్ సిసోడియా పేరు లేదు. తర్వాత ఆధారాలతో అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ టెండర్లు కట్టబెట్టారనే నేపథ్యంలో మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై పలు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవ ఉన్నారు.