»Did Your Grandfather Set Up The Party Vamsi Asked Lokesh
vallabhaneni vamsi on lokesh:ఇప్పుడు వంశీ.. పార్టీ మీ తాత ఖర్చూరనాయుడు పెట్టారా అంటూ?
vallabhaneni vamsi on lokesh:టీడీపీ యువనేత నారా లోకేశ్ (lokesh) జూనియర్ ఎన్టీఆర్‌ను (jr ntr) పార్టీలోకి రావాలని ఇచ్చిన పిలుపు అగ్గిరాజేసింది. ఈ రోజు ఉదయమే మాజీమంత్రి కొడాలి నాని.. లోకేశ్‌ను ఏకీపారేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ (vamsi) వంతు వచ్చింది. తెలుగుదేశం పార్టీ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామరావు అని పేర్కొన్నారు. మరీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేది ఏంటీ అంటూ దుయ్యబట్టారు.
Did your grandfather set up the party? vamsi asked lokesh
vallabhaneni vamsi on lokesh:టీడీపీ యువనేత నారా లోకేశ్ (lokesh) జూనియర్ ఎన్టీఆర్‌ను (jr ntr) పార్టీలోకి రావాలని ఇచ్చిన పిలుపు అగ్గిరాజేసింది. ఈ రోజు ఉదయమే మాజీమంత్రి కొడాలి నాని.. లోకేశ్‌ను ఏకీపారేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ (vamsi) వంతు వచ్చింది. తెలుగుదేశం పార్టీ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామరావు అని పేర్కొన్నారు. మరీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేది ఏంటీ అంటూ దుయ్యబట్టారు. ఆ పార్టీని నీ తాత ఖర్జూరనాయుడు ఏర్పాటు చేయలేదని వంశీ (vamsi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి పిలవడానికి నువ్వెవరు అని లోకేశ్ పై మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) కూడా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తనను పశువుల డాక్టర్ అంటున్నారని, తాను కూడా అదే రీతిలో విమర్శిస్తే భోరున విలపిస్తాడేమో అని సెటైర్లు వేశారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంట అనేవిధంగా చంద్రబాబు కామెంట్స్ ఉన్నాయన్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణను రాష్ట్రంలో తిరగకుండా చంద్రబాబు నియంత్రించలేదా? అని ప్రశ్నించారు.
చదవండి:kodali nani on lokesh:పార్టీని జూ.ఎన్టీఆర్‌కు ఇచ్చేయు.. లోకేశ్‌పై కొడాలి నాని ఫైర్
అంతకుముందు నారా లోకేశ్‌పై (lokesh) మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌ను (jr.ntr) టీడీపీలో చేరమని లోకేశ్ (lokesh) అడగడం ఏంటీ అని మండిపడ్డారు. ఆ పార్టీ ఆయన తాత పెట్టింది అని పేర్కొన్నారు. లోకేశ్ (lokesh) ఆహ్వానించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. నిన్న తిరుపతి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో నారా లోకేశ్.. తారక్‌ను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై కొడాలి నాని (kodali nani) రియాక్ట్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించి.. చంద్రబాబు (chandrababu), లోకేశ్ (lokesh) పార్టీ నుంచి తప్పుకోవాలని కొడాలి నాని (kodali nani) డిమాండ్ చేశారు. మార్పు రావాల్సింది రాష్ట్రంలో కాదు.. టీడీపీలో అని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ను (cm jagan) ఓడించే దమ్ము లేక జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
చదవండి:nara lokesh on jr.ntr:నారా లోకేశ్ సంచలనం, జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి
తారక్‌నే కాదు.. చిరంజీవి (chiranjeevi) గురించి కూడా లోకేశ్ మాట్లాడారు. తాను చిరంజీవి అభిమానిని అని.. ఫస్టో డే.. ఫస్ట్ షో ఆయన సినిమా చూస్తానని వివరించారు. ఎన్నికల వేళ.. లోకేశ్ సొంత ఇమేజీతో కాక ఇలా చిరు, తారక్ అంటున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు.
కొడాలి నాని, వంశీ, వంగవీటి రాధా ముగ్గురు మిత్రులు. నాని వైసీపీలో ఉండగా.. వంశీ వైసీపీ అనుబంధం సభ్యుడిలా వ్యవహరిస్తున్నారు. రాధా టీడీపీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా.. సరే ముగ్గురు కలిసే ఉంటారు. తారక్‌ను ఏమైనా అంటే కొడాలి నాని, వంశీ అస్సలు ఊరుకోరు. పలు సందర్భాల్లో అదీ రుజువు కూడా అయ్యింది.