AP: పందెం పేరుతో ఇద్దరు విద్యార్థులు అధిక మోతాదులో ఐరన్ మాత్రలు వేసుకుని అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని ఈపూరులో చోటుచేసుకుంది. ఒక విద్యార్థి 10 మాత్రలు, మరో విద్యార్థి 20 మాత్రలు వేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వార్డెన్ వెంకటేశ్వర్లు నాయక్ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు చల్లా సతీష్ కుమార్, మక్కెన హానిగురుగా గుర్తించారు.