KRNL: ఆదోని పట్టణ పరిధిలోని గణేశ్ సర్కిల్ ప్రాంతంలో ఎరుకల రామన్న కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై ఆదోని MLA వెంటనే స్పందించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కర్నూలు గౌరవ అధ్యక్షుడు సునీల్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. MLA పార్థసారథి రామన్న కుటుంబాన్ని పరామర్శించి ఆదోని పరిధిలో 10వేల గిరిజనులకు భరోసా ఇవ్వాలన్నారు. దాడి చేసిన నిందితులకు శిక్ష పడే విధంగా MLA చెయ్యాలని అన్నారు