AP: గిరిజనులు దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో 39వేల మందితో గిరిజనుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిజన ప్రజల్లో చాలామందికి ఆధార్, రేషన్ కార్డులు లేవని పేర్కొన్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేస్తామని అన్నారు. గిరిజనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు.