»Huge Earthquake In Indonesia Earth Shook Again In Turkey
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం..టర్కీలో మళ్లీ కంపించిన భూమి
ప్రకృతి విలయతాండవం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు టర్కీ(Turkey), సిరియా(Syria)లో భూకంపం(Earthquake) సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా ఇండోనేషియా(Indonasia)లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది.
ప్రకృతి విలయతాండవం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు టర్కీ(Turkey), సిరియా(Syria)లో భూకంపం(Earthquake) సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా ఇండోనేషియా(Indonasia)లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. యుఎస్జీఎస్(Usgs) వివరాల ప్రకారం ఈ భూకంపం(Earthquake) టొబెలోకు ఉత్తరాన 177 కిలోమీటర్ల దూరంలో, 99 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు సమాచారం. అయితే ఈ భూకంపం(Earthquake) వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ఇండోనేషియా(Indonesia)లో ఇటువంటి భూకంప ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.
జనవరి నెలలో కూడా ఇండోనేషియా(Indonesia) భూకంపం(Earthquake) ధాటికి తీవ్రంగా వణికింది. జనవరి 10వ తేదిన భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది. ఆ భూకంప తీవ్రత 7.7గా రిక్టర్ స్కేలుపై ఏర్పడింది. అయితే ఆ భూకంప ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. గత ఏడాది కూడా 5.6 తీవ్రతతో భూకంపం(Huge Earthquake) విధ్వంసం సృష్టించింది. ఆ ఘటనలో 268 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికిపైగా గాయాలపాలయ్యారు. అలాగే 150 మంది గల్లంతయ్యారు. ఆ భూకంపం(Huge Earthquake) 100 మంది చిన్నారులను పొట్టనబెట్టుకుంది.
టర్కీ(Turkey)లో మళ్లీ భూమి కంపించింది. గురువారం సాయంత్రం భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప(Earthquake) తీవ్రత 5.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. టర్కీ(Turkey)లో మూడు రోజుల్లో ఇలా భూకంపం(Earthquake) సంభవించడం ఇది రెండోసారి. వరుస భూకంపాలతో టర్కీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 6వ తేదిన టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం(Earthquake) ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 47,244 మంది మరణించారు.