KMR: పర్యాటక వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ‘బ్రాండ్ కిట్ పోస్టర్’ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు దామోదర్ రెడ్డి, శ్రీధర్, విజయలక్ష్మి, రంగ వెంకటేశ్వర్ గౌడ్ ఉన్నారు.