E.G: గోకవరం మండలం కొత్తపల్లి మేజర్ పంచాయతీలో ఐదేళ్ల క్రితం నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ పేరుకే తప్ప వినియోగంలోకి రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సబ్స్టేషన్ అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామంలోని ప్రతి వీధిలోనూ తీవ్రమైన లో వోల్టేజ్ సమస్య ఎదురవుతోందని వాపోతున్నారు. ఐదేళ్లు దాటినా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.