TG: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికి నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. 2019 తర్వాత కేంద్రానికి వెళ్లిన ప్రతి రూపాయిలో 87 పైసలు తిరిగొచ్చాయన్నారు. తనకు బండి సంజయ్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలన్న వారిలో తాను కూడా ఉన్నానన్నారు. బండి భగీరథ్ పై కేసు వెనుక నేను ఉన్నానే ఊహాగానాల్లో నిజం లేదన్నారు.