VZM: రామతీర్థం పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గిరి ప్రదక్షిణ రోడ్డును శనివారం జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సందర్శించారు. అనంతరం రామతీర్థం శ్రీ రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ మేరకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అభివృద్ధి దృక్పథాన్ని ప్రశంశించారు.