SRPT: కోదాడలో మానవత్వం చాటుతూ చిన్నారులు ఒక కుక్కపిల్లకు ప్రాణం పోశారు. ఎండ వేడిమికి ఆటో నీడన సేదతీరుతున్న కుక్కపిల్లను, ఆటో స్టార్ట్ చేయడంతో దాని కాలికి గాయమైంది. ఈ సంఘటనను గమనించిన చిన్నారులు వెంటనే ఆ కుక్క పిల్లను సమీపంలోని పశువైద్యశాలకు తరలించి, చికిత్స చేయించారు. డాక్టర్ పెంటయ్య కుక్క పిల్లకు చికిత్స అందించి, చిన్నారుల ఔదార్యాన్ని అభినందించారు.