AKP: పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)ను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించినట్లు ఎస్ రాయవరం మండల వ్యవసాయ అధికారిణి సౌజన్య తెలిపారు. అడ్డరోడ్డు జంక్షన్ లో ఎరువుల, పురుగుల మందు షాపులను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, స్టాక్‌ని తనిఖీ చేశారు. షాప్‌లో 20.950 లీటర్ల గడ్డి మందును గుర్తించారు. తాత్కాలికంగా 60 రోజుల స్టాప్ సేల్ నోటీస్ జారీ చేశారు.