AKP: కార్తీక మాసం పురస్కరించుకొని నర్సీపట్నం నుండి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం ధీరజ్ గురువారం తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరిన బస్సులు ద్వారా భక్తులకు దర్శనాలు పూర్తి చేయించి మంగళవారం తెల్లవారుజామున నర్సీపట్నం తీసుకువస్తామన్నారు. రిజర్వేషన్ సదుపాయం ఉందని పేర్కొన్నారు.