AKP: నర్సీపట్నం గ్రంధాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం గ్రంధాలయధికారిణి దమయంతి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్రాంతి వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశవ్యాప్తంగా 550 సంస్థానాలను విలీనం చేసిన మహనీయుడిని పేర్కొన్నారు.