ASR: బొర్రా పంచాయతీ గేటువలస గ్రామనికి చెందిన వంతల సోని, పుష్పకు జన్మించిన 4 నెలల చిన్నారి గురువారం ఉదయం మృతి చెందింది. మూడు రోజులు నుంచి తీవ్ర జ్వరంతో చికిత్స పొందుతూ నేడు మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు నెలల చిన్నారి మృతిచెందడంతో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పండగ రోజు చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.