ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు కచ్చితంగా స్పందిస్తామని ఇరాన్ ఇటీవల వెల్లడించింది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ స్పందన తీవ్రంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు ఆంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇక అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.