కడప: రాయచోటి పట్టణంలో మాసాపేట సమీపంలోని గోవర్ధన గిరి కృష్ణ ఆలయం నిర్మించడం జరుగుతుందని నిధులు మంజూరు చేయాలని కోరుతూ యాదవ సంఘం నాయకులు చిన్నమండెం మండలం బొర్రెడ్డివారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నివాసానికి వెళ్లి గురువారం సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.