KDP: రేపు ఉదయం 10:30 గంటలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సమావేశపు అజెండాను కౌన్సిలర్లు, సభ్యులకు పంపామన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.