చిత్తూరు: ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాలలో సరికొత్త కాంతులను నింపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య సురక్షితంగా ఈ వెలుగుల పండుగను జరుపుకోవాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇందులో భాగంగా జిల్లా ప్రజలకు ఆమె పండుగ శుభాకాంక్షలు తెలిపారు.