ATP: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. ఈ తరహా కాల్స్, వీడియో కాల్స్‌తో సైబరు మోసగాళ్లు ప్రజలకు వల వేస్తున్నారన్నారు. చిరునామా, ఆధార్, ఫోన్ నంబరు వంటి కొంత సమాచారాన్ని ముందుగా మనకు తెలిపి మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా నగదును పోగొట్టు కొన్నట్లయితే నేషనల్ సైబరు క్రైం పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలనారు.