ELR: తిరువూరులో దీపావళి బాణాసంచా దుకాణాలను ఆర్డీవో కే. మాధురి బుధవారం తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన షాప్ నెం.13 దుకాణదారునిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు. దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆమె కోరారు.