దీపావళి అంటే పండగ మాత్రమే కాదు గ్రామం పేరు కూడా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఈ దీపావళి గ్రామం ఉంది. ఇక్కడ ఐదు రోజులపాటు దీపావళి పండగను గ్రామ ప్రజలు సంబురంగా జరుపుకుంటారు. పండగ రోజు పితృదేవతలకు పేజల చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత టపాసులు కాల్చుకుని కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు.