పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది ICC ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. చాలా ఏళ్ల తర్వాత తమ గడ్డపై ICC ట్రోఫీ జరుగుతుండటంతో PCB ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే, పాకిస్తాన్ లిమిటెడ్ ఓవర్స్ జట్టుకు ఇటీవల కెప్టెన్గా ఎంపికైన మహ్మద్ రిజ్వాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ రావాలని ఆకాంక్షించాడు. టీమిండియా పాక్ గడ్డపై ఆడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపాడు. వారు వచ్చేందుకు BCCI ఓకే చెబితే ఘనస్వాగత్వం పలుకుతామన్నాడు.