హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’ లో ఆంజనేయుడిగా కనిపించేది ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. ‘కాంతార’ సినిమాతో అలరించిన కన్నడ స్టార్ రిషభ్ షెట్టి ‘జై హనుమాన్’లో ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.