‘క’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనపై వస్తోన్న ట్రోల్స్‌పై మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా దీనిపై హీరో విశ్వక్సేన్ స్పందించాడు. ఎదిగే హక్కు ప్రతిఒక్కరికి ఉందంటూ కిరణ్ అబ్బవరంకు మద్దతు తెలిపాడు. ‘నీకు మరింత పవర్ చేకూరాలని ఆశిస్తున్నాను. క సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.