TPT: టర్కీలో జరిగే ఇంటర్నేషనల్ గోల్ బాల్ పోటీలకు వెంకటగిరికి చెందిన అంధ యువకుడు ముప్పాళ్ల శేషగిరి ఎంపికయ్యాడు. పాట్నాలో జరిగిన పోటీల్లో ఏపీ తరఫున అతను పాల్గొన్నాడు. అక్కడ ప్రతిభచూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. దీంతో అతడిని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తన కార్యాలయంలో అభినందించారు.