SRD : జిన్నారం మండలం బొల్లారం టీజీఎంఎస్ పాఠశాలలో ఎస్ఎస్సి 2026 ఫలితాలు శాతం వందగా నమోదయ్యాయి. పరీక్షలకు హాజరైన 100 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బి.కావ్య 561 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, టి.వాసవి 559తో ద్వితీయ స్థానం పొందింది. ఆర్. భానుప్రియా, జె.ప్రణతి ఇద్దరూ 557 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.