సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం పొందారు. జనవరి 27 వ తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యద్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తారకరత్న అస్వస్థతకు గురై… 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృత్యు ఒడికి చేరారు. ఆయన మృతిని అందరినీ కలిసి వేసింది. భౌతికకాయాన్ని బెంగళూరు నుండి హైదరాబాద్ లోని వారు ఇల్లు మోకిలకు తరలించారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థమ్ సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మహ ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సినిమాలలో నిలదొక్కుకోలేక పోయినప్పటికీ వరుసగా సినిమాలు తీసి సత్తా చాటే ప్రయత్నం చేశారు. ఓకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 21 ఏళ్ల వయస్సులో సినీ అరంగేట్రం చేశారు. తారకరత్న మృతి పట్ల బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తారకరత్న ను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తరలి వస్తున్నారు.
అతని మృతి సినీ రంగానికి, పార్టీకి ఎంతో లోటు అని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు లోకేష్ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతకి గురైన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తారకరత్న మృతి వార్త విని షాకయ్యానని నటుడు మహేష్ బాబు అన్నారు. ఆయన కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. మరణ వార్తను విని ఎంతో విచారించానని వెంకయ్య నాయుడు అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి వస్తారని భావించానని, కానీ ఇంతలో ఇలాంటి వార్త వినవలసి వస్తుందని ఊహించలేదు అన్నారు. చిన్న తనంలోనే సినీ రంగ ప్రవేశం చేసి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న మృతి కలిచి వేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న ఆయన శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం చెందారు. జనవరి 26వ తేదీన తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండెనొప్పి వచ్చి కుప్ప కూలాడు. అతనిని కుప్పంలో హాస్పిటల్ లో చేర్పించారు. అనంతరం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. 23 రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్ను మూశారు. ఆయన పరిస్థితి ఉదయం నుండే అత్యంత విషమం అని వార్తలు వచ్చాయి. రాత్రికి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.