»Special Video Of Manchu Lakshmi On The Occasion Of Mahashivratri
Manchu Lakshmi: మహాశివరాత్రి సందర్భంగా మంచులక్ష్మీ స్పెషల్ వీడియో
సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ(Manchu Family) గురించి ఎప్పుడూ ఏదోక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా శివరాత్రి(ShivaRatri) సందర్భంగా మంచు లక్ష్మీ(Manchu Lakshmi) ఓ స్పెషల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది.
టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ(Manchu Family) గురించి ఎప్పుడూ ఏదోక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అందులోనూ మోహన్ బాబు(Mohan Babu) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ(Manchu Lakshmi) గురించి మీమ్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇండస్ట్రీలో తన నటనతో, పంచ్ డైలాగులతో మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో ఆమె పలు హాలీవుడ్ షార్ట్ ఫిలింస్ లల్లో కూడా నటించింది.
అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరపై మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఐరేంద్రిగా, ప్రతినాయకురాలి పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తర్వాత దొంగలముఠా, గుండెల్లో గోదారి, చందమామ కథలు వంటి సినిమాల్లో నటించింది. అటు నటిగానే కాకుండా ఇటు హోస్ట్ గా, నిర్మాతగా చేసింది. హోస్ట్ గా బుల్లితెరపై పలు షోలు చేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ(Manchu Lakshmi) నటించిన అగ్ని నక్షత్రం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా శివరాత్రి(ShivaRatri) సందర్భంగా మంచు లక్ష్మీ(Manchu Lakshmi) ఓ స్పెషల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. ఆది శంకరాచార్యులు రచించిన నిర్వాణ శకటం శ్లోకాన్ని మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి ఆలపించడం విశేషం. వారణాసిలోని పవిత్ర ఘాట్ వద్ద పాటను చిత్రీకరించారు. కన్నూ సమీర్ స్వరపరిచిన ఈ పాటలో ఇంగ్లీష్ సాహిత్యాన్ని కూడా ఉంచారు. ఈ పాట ద్వారా వారణాసిని కళ్లకు కట్టినట్లు చూపించారని చెప్పాలి. ఎప్పుడూ మంచు లక్ష్మి(Manchu Lakshmi) ని ట్రోల్స్ చేసేవారు సైతం ఆ పాటతో ఆమెను ప్రశంసిస్తున్నారు. మంచు లక్ష్మీ అద్భుతంగా పాడిందని, పాట చాలా బావుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.