SKLM: పాతపట్నం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచబోదని అవసరమైతే 30% కరెంటు చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ అమలపై నీలి నీడలు అలుముకున్నాయన్నారు. దీపావళి నుంచి విద్యుత్ చార్జీల పెంపు అనే అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.