NRML: దిలావర్పూర్ మండలం బన్సపల్లి గ్రామంలో సోమవారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే తమ వరి ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.