VZM: గ్రామాల్లో చేపట్టనున్న ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ పనులు సర్పంచులకే అప్పగించాలని మండలానికి చెందిన సర్పంచులు డిమాండ్ చేశారు. భోగాపురం ఎంపీడీవో కిషోర్ కుమార్‌కి సోమవారం వినతిపత్రం అందజేశారు. వైసీపీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూటమి నాయకులకు అప్పగించడం చట్ట వ్యతిరేకమన్నారు.