ADB: హైదరాబాద్లోని హిమాయత్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, కార్యదర్శి బాలరాజు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాకు సంబంధించిన పలు కార్మికుల అంశాలపై వివరించడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ తెలిపారు. సంఘాల బలోపేతం తదితరాంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు.