ఈ ఏడాది శీతాకాలం ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ చివరి వారం నుంచి ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, రాత్రిళ్లు ఉక్కపోత ఉండే అవకాశం ఉండనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం 30 డిగ్రీల నుంచి 34 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.