AP: కోలీవుడ్ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అభినందనలు తెలుపుతూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని పేర్కొన్నారు. కాగా, విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.