AP: 36 మంది స్కిల్ సెక్టార్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చించామని సీడాప్ ఛైర్మన్ దీపక్ వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ ఏడాదిలో 1.24 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో 93 వేల మందికి స్వయం ఉపాధి కింద శిక్షణ ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.