AP: నటి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఊరట దక్కలేదు. విద్యాసాగర్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ విద్యాసాగర్ పిటిషన్ వేశారు. జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో విజయవాడ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేశారు. అయితే అతని అరెస్ట్ అంశంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.