AP: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సీఐడీ కస్టడీ ముగిసింది. 48 గంటల పాటు చైతన్యను పోలీసులు విచారించారు. కస్టడీ అనంతరం గుంటూరు జిల్లా ఐదో నెంబర్ కోర్టులో హాజరుపరిచారు. చైతన్యకు మరో 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.