AP: గత ఐదేళ్లుగా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. మంత్రి కొల్లు రవీంద్రపై కూడా హత్య కేసు పెట్టారని ధ్వజమెత్తారు. అనకాపల్లి ఇంఛార్జి మంత్రి కొల్లురవీంద్రను సత్కరించిన అనిత.. అనకాపల్లి జిల్లాను మోడల్ జిల్లాగా మార్చుకుందామన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేశ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.