Ram Charan : ప్రస్తుతం శంకర్‌తో ఆర్సీ 15 చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కానీ ఆ తర్వాతే చరణ్ లైనప్ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎందుకంటే..
ప్రస్తుతం శంకర్‌తో ఆర్సీ 15 చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కానీ ఆ తర్వాతే చరణ్ లైనప్ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎందుకంటే.. ఆ మధ్య ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఏకంగా ఆరు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసినట్టు చెప్పుకొచ్చాడు చరణ్. అప్పటి నుంచి ఏంటా ప్రాజెక్ట్స్.. ఎవరా ఆ ఆరుగురు డైరెక్టర్స్.. అని ఆరా తీస్తునే ఉన్నారు మెగాభిమానులు. కన్నడ డైరెక్టర్ నార్థన్, సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్‌తో పాటు ఇంకొంతమంది డైరెక్టర్స్.. చరణ్‌తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. కాకపోతే వీళ్ల కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత.. చరణ్‌తో సినిమాలు చేయనున్నారు. కానీ ఇప్పుడు చెర్రీతో మరో టాలెంటెడ్ డైరెక్టర్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా యువీ క్రియేషన్స్ వారు రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ యూవీ బ్యానర్లోనే రావాల్సింది. కానీ అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో యూవీ వారు మరో డైరెక్టర్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ డైరెక్టర్ నర్తన్ పేరు వినిపించింది. అలాగే బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కాంబో దాదాపుగా ఫిక్స్ అయిందని అంటున్నారు. ఫస్ట్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మల్లిడి వశిష్ట.. . బింబిసార2 లైన్లో ఉండగానే బడా బడా స్టార్స్‌ను లైన్లో పెడుతున్నాడు. రజనీ కాంత్‌కు కూడ కథ చెప్పాడని.. ఆ మధ్యన ఓ టాక్ కూడా నడిచింది. అయితే ఇప్పుడు దాదాపుగా చరణ్‌తో ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది. ఇటీవలే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ దాదాపుగా ఈ కాంబో ఫిక్స్ చేసేసిందని టాక్. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చూడాలి.