మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఈ నెల 21 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఖరారైంది. రేపు సాయంత్రం 6 గంటలకు HYDలోని ఫిలింనగర్ JRC కన్వెన్షన్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది.