»Attack On Cricketer Prithvi Shah Case Registered Against 8 People
Attack on cricketer : క్రికెటర్ పృథ్వీ షాపై దాడి.. 8 మందిపై కేసు నమోదు
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shah) పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తన స్నేహితుడితో కలిసి బుధవారం (ఫిబ్రవరి 15న) ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబయిలోని ఓషివారా(Oshiwara )పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shah) పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తన స్నేహితుడితో కలిసి బుధవారం (ఫిబ్రవరి 15న) ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబయిలోని ఓషివారా(Oshiwara )పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత సెల్ఫీలను తిరస్కరించినందుకు దాడి చేసినట్లు (Attack On Prithvi Shaw) భావించినప్పటికీ.. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులోపృథ్వీ షా స్నేహితుడు ఆశిశ్ సురేంద్ర(Ashish Surendra) తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సురేంద్రతో కలిసి పృథ్వీ షా శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లాడు.
నిందితులు సెల్ఫీ(Selfie) కోసం పృథ్వీ షా వద్దకు వచ్చారు. అయితే ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు షా ఆసక్తి చూపగా.. గ్రూప్‌లోని మిగతావారు కూడా వచ్చి సెల్ఫీ ఇవ్వాలన్నారు. తాను స్నేహితులతో కలిసి భోజనానికి వచ్చానని, ఇప్పుడు అందరితో సెల్ఫీ ఇవ్వడం కుదరదని పృథ్వీ షా వారికి సమాధానం ఇచ్చాడు. అప్పటికీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో షా స్నేహితుడు వెంటనే హోటల్ మేనేజర్‌ను పిలిచి ఫిర్యాదు చేశారు. హోటల్ (Hotel )నుంచి వెళ్లిపోవాలని నిందితులను మేనేజర్ అడగడంతో అదంతా మనసులో పెట్టుకొని.. హోటల్ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ షా, అతడి స్నేహితుడి కారుపై బేస్‌బాల్ (Baseball) బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. బీఎండబ్ల్యూ కారు వెనుక, ముందర భాగంలోని కిటికీలు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.
సంఘటన సమయంలో కారులోనే పృథ్వీ షా (Prithvi Shah) ఉన్నాడని.. అయితే దీనిని వివాదం చేయకూడదనే ఉద్దేశంతో అతడిని వేరే కారులో సురక్షితంగా ఇంటికి పంపించినట్లు సురేంద్ర తెలిపారు. ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్స్ 143, 148, 149, 384, 437, 504, 506 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పృథ్వీనే సప్నపై దాడి చేశాడు. అతడి చేతిలో ఓ కర్ర కనిపిస్తోంది. పృథ్వీ స్నేహితుడే మొదట వారిని కొట్టాడు. సప్న ప్రస్తుతం ఓషివరా (Oshiwara ) పోలీస్ స్టేషన్లో ఉంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు” అంటూ అలీ కాషిఫ్ చెప్పుకొచ్చింది.ఈ ఘటనపై షా స్నేహితుడు సురేంద్ర ఓషివరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులిల్లో ఇద్దరిని గుర్తించారు. సనా అలియాస్ సప్నా గిల్, శోభిత్ ఠాకూర్‌ను అదుపులోకి తీసుకొన్నారు.షా కారు వద్దకు ఓ యువతిని పంపిన నిందితులు యాభై వేల నగదు ఇస్తే విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని.. లేకపోతే కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా ఓషివరా పీఎస్‌కు చేరుకున్నాడు.